Friday, September 19, 2025

మయన్మార్ భూవిలయం..ప్రార్థనలు చేస్తూనే 700 మంది సజీవ సమాధి

- Advertisement -
- Advertisement -

గతవారం మయన్నామర్ , థాయ్‌లాండ్‌లో సంభవించిన భారీ భూకంపాలు పెను విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. మయన్మార్‌లో భూవిలయానికి సంబంధించి మరిన్ని విషయాలు వెలుగు లోకి వచ్చాయి. రంజాన్ శుక్రవారం వేళ ముస్లింలు పార్థనలు చేస్తుండగా ఈ విపత్తు చోటు చేసుకోవడంతో దేశ వ్యాప్తంగా 700 మంది శిథిలాల కింద సజీవ సమాధి అయినట్టు తెలుస్తోంది. ఈమేరకు అక్కడి ముస్లిం ఆర్గనైజేషన్ సోమవారం వివరాలు వెల్లడించింది. మయన్మార్ లోని రెండో పెద్ద నగరమైన మాండలేలో గత శుక్రవారం 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దీంతో నగర వ్యాప్తంగా వందల సంఖ్యలో భవనాలు నేల మట్టమయ్యాయి.

ఈ ప్రకంపనల ధాటికి 60 మసీదులు తీవ్రంగా ధ్వంసమయ్యాయని స్ప్రింగ్ రివల్యూషన్ మయన్మార్ ముస్లిం నెట్‌వర్క్ కమిటీ సభ్యుడు టున్‌కీ వెల్లడించారు. మధ్యాహ్నం సమయంలో ప్రార్థనలు చేస్తుండగా ఈ విపత్తు రావడంతో శిథిలాల కిందే 700 మందిరి సౌగా ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. అయితే వీరి మరణాలను మయన్మార్ మిలిటరీ ప్రభుత్వం వెల్లడించిన మృతుల సంఖ్యలో చేర్చారా లేదా ? అనే దానిపై స్పష్టత లేదు. మయన్మార్‌లో మృతుల సంఖ్య ఇప్పటికే 1700 దాటినట్టు మిలిటరీ ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. మరో 3400 మంది గాయపడగా, 300 మందికి పైగా ఆచూకీ ఇంకా తెలియరాలేదు. శిథిలాల కింద ఇరుక్కున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News