- Advertisement -
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డ్రోన్స్ తో భారత్ పై దాడులకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. పాక్ దాడులను భారత ఆర్మీ తిప్పికొడుతోంది. రంగంలోకి దిగిన భారత యుద్ధవిమానాలు.. గగనతలంలో నిరంతరం గస్తీ కాస్తున్నాయి. అలాగే, మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను కేంద్రం యాక్టివేట్ చేసింది. మరోవైపు, నియంత్ర రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది.
ఈ క్రమంలో పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. సరిహద్దు దగ్గర అనుమానాస్పదంగా కనిపిస్తే కాల్చివేసేలా భారత ఆర్మీ ఉన్నతాదికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మే 9 వరకు సరహద్దు ప్రాంతాలైన జోధ్‌పూర్, బికనేర్, కిషన్‌ఘర్ విమానాశ్రయాల మూసివేస్తున్నట్లు తెలిపారు. పంజాబ్ సరిహద్దులోని ఆరు జిల్లాల్లో పాఠశాలల మూసివేశారు.
- Advertisement -