Saturday, September 20, 2025

అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరిస్తాం: లోకేష్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీకి గిన్నిస్ రికార్డు ఇవ్వాలనే యోగాంధ్ర నిర్వహించామని ఎపి మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రజల్లో వచ్చిన చైతన్యం వల్లే యోగాంధ్ర విజయం అయిందని, యోగాంధ్ర కార్యక్రమం ఆంధ్రుల విజయం అని ప్రశంసించారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ…సాంకేతిక సాయంతో పకడ్భందీగా ఏర్పాట్లు చేయడంతో యోగాంధ్ర రికార్డు స్థాయికి చేరుకుందని, ప్రతీ ఒక్కరూ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని అన్నారు. వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ఫ్రస్టేషన్ తో ఊగిపోతున్నారని, ఆయన కూడా యోగాసనాలు వేయాలని ఎద్దేవా చేశారు. అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరిస్తామని, విశాఖపట్నం ను ఐటి హబ్ (Visakhapatnam IT hub) గా తీర్చిదిద్ది 5 లక్షల ఉద్యోగాలు తీసుకురావడమే లక్ష్యం అని తెలియజేశారు. 99 పైసలకే ఎకరా భూమి ఇవ్వడం వల్ల టిసిఎస్, కాగ్నిజెంట్ వచ్చాయని  పేర్కొన్నారు. విశాఖ ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు విశాఖ ప్రజలు ప్రశాంతగా ఉన్నారని చెప్పారు. విశాఖకు చాలా కంపెనీలు వస్తున్నాయని, వినూత్న కార్యక్రమాలకు విశాఖ వేధిక అవుతోందని లోకేష్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News