గంజాయి సాగు, సరఫరా, విక్రయాలపై
ఈగల్ నిఘా డ్రగ్స్ నిర్మూలనలో
తెలంగాణ దేశానికే ఆదర్శం కావాలి
తెలంగాణ అంటే ఉద్యమాలు,
పోరాటాల గడ్డ ఉద్యమాల గడ్డ డ్రగ్స్‌కు
అడ్డాగా మారితే అవమానకరం
విద్యాసంస్థల్లో బిహేవియర్ అబ్జర్వర్‌లను
నియమించుకోవాలి విద్యాసంస్థల్లో
డ్రగ్స్ దొరికితే యాజమాన్యాలపై కేసు
అంతర్జాతీయ యాంటీ డ్రగ్ డే
కార్యక్రమంలో సిఎం రేవంత్‌రెడ్డి
ఈగల్ లోగో ఆవిష్కరించిన సిఎం
హాజరైన సినీ, క్రీడా ప్రముఖులు
మన తెలంగాణ/హైదరాబాద్ : డ్రగ్స్, గం జాయి గు రించి టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం ఇస్తే కట్టడి చేస్తామని, స్కూల్స్, కాలేజీల్లో మాదక ద్రవ్యాలు ఉంటే అది టీచర్లదే బాధ్యత అని, పర్యవేక్షించాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని సిఎం రేవంత్‌రెడ్డి సూ చించారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ దొరికితే యా జమాన్యాలపై కూడా కేసులు పెట్టాలని పోలీసులను ఆదేశిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఫీజులు తీసుకుంటాం, బా ధ్యత తీసుకోం అంటే కుదరదని, బిహేవియరల్ ఛేంజెస్ గురించి చెప్పే సైకాలజీ ప్రొఫెషనల్స్‌ను నియమించుకోవాలని విద్యాసంస్థల యాజమాన్యాలకు ముఖ్యమంత్రి సూచించా రు. పిల్లల వ్యవహార శైలిలో మార్పును గమనించాల్సిన బాద్యత టీచర్లది, యాజమాన్యాలదేనని ఆయన అన్నారు. యువత డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలని, యువత బాగుపడితే రాష్ట్రం, దేశం బాగు పడతాయని సిఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో యాంటీ నార్కోటిక్స్ బ్యూ రో ఆధ్వర్యంలో అంతర్జాతీయ యాంటీడ్రగ్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి
ము ఖ్య అతిథిగా హాజరయ్యారు.డ్రగ్ ఫ్రీ తెలంగాణ సంకల్పానికి ప్రతి ఒక్క రూ అండగా నిలవాలి ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మా ట్లాడుతూ స్కూల్స్, కాలేజీల్లో కూడా వి ద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. స్కూల్స్, కాలేజీల ఎదుట గంజాయి చాక్లెట్స్ అమ్మినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. తెలంగాణలోని యువతకు స్కిల్స్ పెంపొందించేందుకు శిక్షణ ఇస్తే న్యూయార్క్‌తో పోటీ పడగలమని సిఎం రేవంత్ అన్నారు. మాదక ద్రవ్య రహిత సురక్షితమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్క రూ నడుం బిగించాలని సిఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువతను ఆరోగ్యకరమైన ఉజ్వల భవిష్యత్ వైపు నడిపించడమే లక్ష్యంగా కలిసి పని చేద్దామని అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేకదినం సందర్భంగా సిఎం కోరారు. డ్రగ్ ఫ్రీ తెలంగాణ సంకల్పానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని సిఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.
‘ఈగల్’ ఇక టార్గెట్ మిస్‌కాకుండా…
తెలంగాణలో డ్రగ్స్, గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పనిచేసే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ఇక నుంచి ‘ఈగల్’ అని పిలవనున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గ్రద్ద ఎలాగైతే పైనుంచి చూసి టార్గెట్ మిస్సవ్వకుండా ఎటాక్ చేస్తుందో అదే మాదిరిగా ‘ఈగల్’ డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలు అమ్మే వారిని టార్గెట్ చేసి కట్టడి చేస్తుందని సిఎం రేవంత్ తెలిపారు. ఈగల్ అంటే ‘ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్’ అని సిఎం చెప్పారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ మహమ్మారి నుంచి కాపాడేందుకు ‘ఈగల్’ అనే ఆర్గనైషన్‌గా క్రియేట్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణలో ఉన్న ఒక కోటి 50 లక్షల ఎకరాల్లో ఎక్కడ గంజాయి పండించినా ‘ఈగల్’ కట్టడి చేస్తుందని ఈ సందర్భంగా సిఎం రేవంత్ తెలిపారు.
డ్రగ్స్ కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలి
డ్రగ్స్ కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ప్రభుత్వమో, పోలీసులో తలుచుకుంటేనే డ్రగ్స్ నిర్మూలన జరగదని అందరూ భాగస్వాములు అయినప్పుడే డ్రగ్స్‌ను కట్టడి చేయవచ్చని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ టార్గెట్ బెంగళూర్, ముంబై, ఢిల్లీ కాదని తమ టార్గెట్ న్యూయార్క్ అని సిఎం రేవంత్ అన్నారు. యువతకు నైపుణ్యాల కోసం స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయిలో నిలబెడతామని ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
నల్లమల్లలోని మారుమూల నుంచి హీరో విజయ్ వచ్చి సక్సెస్
హీరో విజయ్ దేవరకొండది తమ పక్క ఊరు అని నల్లమల్ల నుంచి వచ్చారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎక్కడో నల్లమల్లలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన విజయ్ సక్సెస్ అయ్యాడంటే కారణం అతని కఠోర శ్రమ అని సిఎం పేర్కొన్నారు. అలా సక్సెస్ కోసం కష్టపడాలని యువతకు సిఎం రేవంత్ సూచించారు. అప్పుడే సక్సెస్ అవుతారని ఆయన చెప్పారు. తాను కూడా కేవలం 16 సంవత్సరాల్లోనే సిఎం స్థాయికి చేరుకున్నానని, శ్రమ పట్టుదలే ఇందుకు కారణమని సిఎం అన్నారు. ఎంపిటిసి, జడ్పీటిసి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి స్థాయికి తాను చేరుకున్నానంటే తనకు ఎలాంటి చెడు వ్యసనాలు లేకపోవడం వల్లేనని ఆయన తెలిపారు. యూత్ కూడా లక్ష్యాలు పెట్టుకుని నిజాయితీగా కష్టపడాలని సిఎం రేవంత్ సూచించారు.
సినిమా హీరోలు రియల్‌లైఫ్‌ను యూత్ ఆదర్శంగా
హీరోలు సినిమాలో వేసే క్యారెక్టర్‌లు కాకుండా వాళ్ల రియల్ లైఫ్‌ను యూత్ ఆదర్శంగా తీసుకోవాలని సిఎం రేవంత్ సూచించారు. చరణ్ కు బ్యాగ్రౌండ్ ఉన్నా అతని తండ్రి చిరంజీవి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా దేశం గర్వించే స్థాయికి వచ్చారంటే దానివెనుక కఠోరమైన శ్రమ ఉందని సిఎం రేవంత్ అన్నారు. ఆనాడు చిరంజీవి ఏ రోజు బాధకు కుంగిపోలేదని, బాధతో వ్యసనాలవైపు వెళ్లలేదని ముఖ్యమంత్రి తెలిపారు. హీరో రామ్‌చరణ్ కూడా కష్టపడి పైకొచ్చారని, ఆర్‌ఆర్‌ఆర్ ద్వారా ఆయన ఆస్కార్ సాధించారని ఇది దేశానికి గర్వకారణమని సిఎం రేవంత్ కొనియాడారు.
అవార్డు రావడానికి కారణం రాంచరణ్ కఠోరమైన శ్రమ, పట్టుదల అని సిఎం రేవంత్ చెప్పారు. చెడు వ్యసనాలకు బానిసైతే ఇలాంటి సక్సెస్ రాదని ఆయన చెప్పారు. సినిమాల్లో హీరోలకు పాజిటివ్, నెగెటివ్ రోల్స్ ఉండవచ్చు. కానీ, వాళ్ల రియల్ లైఫ్ చాలా గొప్పగా ఉంటుందని ఆయన అన్నారు. ఎంత కఠోర శ్రమ చేస్తేనే ఈస్థాయికి వస్తారని సిఎం రేవంత్ తెలిపారు. వాళ్లు ఎంత కష్టపడితే ఆ స్థాయికి చేరుకుంటారో యువత ఆలోచించాలన్నారు. అందుకే సినిమా రోల్స్ కాకుండా వాళ్ల నిజజీవితాన్ని, వాళ్లు ఎదిగే తీరును, సిన్సియారిటీని ఆదర్శంగా తీసుకోవాలని యువతకు సిఎం సూచించారు.
ఇండియా గోల్డ్ మెడల్ సాధించలేదంటే అవమానం కాదా ?
తెలంగాణకు గొప్ప చరిత్ర ఉందని భూమి కోసం ఉద్యమాలు జరిగాయని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ పోరాటం నుంచే తెలంగాణ ఉద్యమం పుట్టిందని ఆయన అన్నారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో పాఠశాల నుంచి కళాశాల వరకు గంజాయి లేదా డ్రగ్స్‌కు బానిసలు అవుతుంటే చూసుకుంటూ ఉందామా..? అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. 140 కోట్ల జనాభా ఉన్న ఇండియా ఒలింపిక్స్‌లో ఒక్క గోల్డ్ మెడల్ సాధించలేదంటే అది అవమానం కాదా అని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో 68 శాతం యువత గోల్డ్ మెడల్ సాధించలేదంటే మనం ఆలోచించాలని ఆయన సూచించారు. సౌత్ కొరియా హైదరాబాద్ జనాభా అంత ఉన్న ఆ దేశం 32 గోల్ మెడల్స్ సాధించిందని, అందులో ఒకే ఒక్క స్పోర్ట్ యూనివర్సిటీకి 16 మెడల్స్ వచ్చాయని ఆయన తెలిపారు. ఆ దేశంతో మనం పోటీ పడలేకపోతున్నాం అంటే ఆలోచించాలన్నారు.
ఆస్ట్రేలియా, కొరియన్ యూనివర్సిటీల నుంచి నిపుణులను రప్పించి ప్రపంచంలోనే స్పోర్ట్‌లో రాణించేందుకు యువతను తయారు చేస్తామని ఆయన తెలిపారు.
గంజాయికి బానిసలం అయితే దేశం ఎదుగుతుందా
గంజాయికి బానిసలం అయితే దేశం ఎదుగుతుందా అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. ఈ దేశాన్ని ఎదుర్కొలేక కొందరు యుద్ధం చేయొచ్చు, కోవిడ్‌ను పంపొచ్చు, డ్రగ్స్‌ను పంపొచ్చని ఆ ట్రాప్‌లో మనం పడదామా అని సిఎం రేవంత్ పేర్కొన్నారు. దేశ రక్షణకు ఉక్కు కవచంలా నిలిచిన పంజాబ్ డ్రగ్స్ మహమ్మారిలో కొట్టుకుపోతోందని సిఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి యువత గంజాయి, డ్రగ్స్‌తో నాశనం అవుతున్నారన్నారు. ఒకప్పుడు యుద్ధం అంటేనే పంజాబ్ వీరులని, అలాంటి పంజాబ్ నిర్వీర్యం అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంత వేగంగా ఈ మహమ్మారి వ్యాపిస్తుందో ఆలోచించాలని సిఎం రేవంత్ పిలుపునిచ్చారు. డిసెంబర్ 7వ తేదీన బాధ్యత తీసుకున్న తర్వాత మాదక ద్రవ్యాలు తెలంగాణలోని రావొద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చానన్నారు. విజయ్, రాంచరణ్‌లు ఎంత బిజీగా ఉన్నా యువతకు స్ఫూర్తిగా ఉండాలని ఈ కార్యక్రమానికి వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజ్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బిజెపి ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.