హైదరాబాద్: టాలీవుడ్ అగ్రనటుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు సినీ నిర్మాత శిరీష్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. తన మాటలు రామ్ చరణ్ అభిమానుల మనోభావాలను దెబ్బతీసి ఉంటే క్షమించాలని విజ్ఞప్తి చేశారు. గేమ్‌చేంజర్ సినిమా పట్ల ఒక ఇంటర్యూలో తాను చేసిన వ్యాఖ్యలు రామ్‌చరణ్ అభిమానులను బాధపెట్టాయని, సోషల్ మీడియాలో మాధ్యమాల ద్వారా అపార్థాలకు దారి తీయడంతో ఆయన అభిమానులకు క్షమాపణ చెబుతున్నానని శిరీష్ రెడ్డి వివరణ ఇచ్చారు. గేమ్‌చేంజర్ సినిమా కోసం గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ తన పూర్తి సమయం సహకారం అందించారని కొనియాడారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి తమకు ఎన్నో ఎళ్ల నుంచి సానిహిత్యం ఉందని తాము చిరంజీవి, రామ్‌చరణ్,, మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడానని తప్పును ఒప్పుకున్నారు. ’గేమ్ చేంజర్ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. హీరో రామ్ చరణ్, దర్శకుడు నిర్మాతలకు ఏమైనా సహాయం చేశాడా?, కర్టెసీ కోసం కనీసం కాల్ చేసి, ఎలా ఉన్నారని ఇద్దరు అడగలేదు’ అని శిరీష్ వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో దుమారం రేగాయి. దీంతో శిరీష్‌పై రామ్‌చరణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రామ్‌చరణ్ అభిమానులకు సారీ చెప్పిన సినీ నిర్మాత
- Advertisement -
- Advertisement -
- Advertisement -