Saturday, July 5, 2025

భోజనంలో బొద్దింక కాదు వెంట్రుక వచ్చింది: హోంమంత్రి అనిత

- Advertisement -
- Advertisement -

అమరావతి: తన ఆహారంలో బొద్దింక వచ్చిందన్న ప్రచారంపై ఎపి హోంమంత్రి అనిత స్పందించారు. తన భోజనంలో చిన్న తల వెంట్రుక కనిపించిందని,  తన భోజనంలో బొద్దింక వచ్చిందని వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసిపి సోషల్ మీడియా పేజీలలో ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంపై బురద చల్లాలని వైసిపి నేతలు చూస్తున్నారని అని ధ్వజమెత్తారు. గత ఐదేళ్లలో వైసిపి మంత్రులు ఎమ్మెల్యేలు కనీసం ఒక్క హాస్టల్ నైనా తనిఖీ చేశారా? అని నిలదీశారు.

తాము చిత్తశుద్ధితో పని చేస్తున్నాని, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా తొలి అడుగు కార్యక్రమం చేపట్టామని వివరణ ఇచ్చారు. వైసిపి నేతలలో మానవత్వం అనేది ఎక్కడా కనిపించడం లేదని, అధికారంలోకి రావాలని సిఎం కూర్చీలో కూర్చోవాలని వైసిపి అధినేత జగన్ అలోచన చేస్తున్నారని అనిత దుయ్యబట్టారు. పాయకరావు పేట బిసి బాలికల కాలేజీ హాస్టల్‌ను హోంమంత్రి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి మెనూ పాటించడంలేదని, వార్డెన్ అందుబాటులో ఉండలేదని, హాస్టల్ సెక్యూరిటీ గార్డు, వార్డున్‌ను హోంమంత్రి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News