Saturday, October 5, 2024

ఎయిర్ ఇండియా విమానం ఆహారంలో బొద్దింక

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని నుంచి న్యూయార్క్‌కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో సరఫరా చేసిన ఆమ్లెట్‌లో ఒక బొద్దింక కనిపించిందని ప్రయాణికురాలు ఒకరు ఫిర్యాదు చేశారు. మరింత దర్యాప్తు కోసం కేటరింగ్ సర్వీస్ నిర్వాహకుల దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లినట్లు ఎయిర్ ఇండియా తెలియజేసింది. ‘ఈ నెల 17న ఢిల్లీ నుంచి జెఎఫ్‌కె (న్యూయార్క్)కు వెళుతున్న ఎఐ 101 విమానంలో అందజేసిన భోజనంలో ఒక పరాయి సరకు గురించి ఒక ప్రయాణికురాలు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ గురించి మాకు తెలిసింది’ అని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఈ సంఘటన పట్ల ఆ ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు విమానంలో సరఫరా చేసిన ఆమ్లెట్‌లో ఒక బొద్దింక కనిపించిందని ప్రయాణికురాలు ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు. ‘మేము దానిని గమనించే సమయానికి మా రెండు సంవత్సరాల కుమారుడు దానిలో సగంపైగా తినేశాడు. ఫలితంగా ఆహార కల్తీకి గురై ఇబ్బంది పడ్డాం’ అని ఆమె పేర్కొన్నారు. ఆమె ఆ పోస్ట్‌కు ఎయిర్ ఇండియాను. విమానయాన క్రమబద్ధీకరణ సంస్థ డిజిసిఎ, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామమోహన్ నాయుడును జత చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News