చెన్నై: శివగంగా అజిత్ కూమార్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి స్టాలిన్ ఫోన్ చేశారు. అజిత్ కూమార్ తల్లికి సిఎం క్షమాపణలు చెప్పారు. జరగకూడని ఘటన జరిగిందని, ఆమెను ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. ఘటనకు కారణం అయిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే వారందరినీ అరెస్టు చేయించామని, కుటుంబానికి అండగా ఉంటానని సిఎం హామీ ఇచ్చారు. అజిత్ కుమార్ లాకప్ డెత్ కేసును సిబిఐకి బదిలీ చేస్తూ తమిళనాడు సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాయి. లాకప్ డెత్ కేసులో తమిళనాడు ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుబట్టిన విషయం తెలిసిందే. లాకప్ డెత్ కేసులో ఐదుగురు పోలీస్ అధికారులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
తిరుప్పవనమ్‌లోని శివగంగాలో ఓ దేవాలయంలో అజిత్ కుమార్(27) సెక్యూరిటీ గార్డుగా పని చేసేవాడు. బంగారు ఆభరణాలను అజిత్ ఎత్తుకెల్లాడనే అనుమానం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని చితకబాదారు. అజిత్‌ను నిర్మానుష్య ప్రదేశానికి పోలీసులు లారీలతో తీవ్రంగా కొట్టడంతో దెబ్బలు తాళలేక ఘటనా స్థలంలోనే చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసుల తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.