- Advertisement -
బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్ రాంచందర్ రావు ఎన్నికైన తర్వాత జూలై 5 తేదీన బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటగా జులై 5 తేదీ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ దగ్గర్లో ఉన్న గన్ పార్క్లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారన్నారు. తర్వాత ఉదయం 10 గంటలకు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, బిజెపి రాష్ట్ర పదాధికారులు, బిజెపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటా రన్నారు. అనంతరం 11 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహిస్తారన్నారు.
- Advertisement -