సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న ఒకేషనల్ కళాశాలల్లో తాత్కాలిక బోధనకు అర్హత, అనుభవం కలిగిన నిపుణులైన బోధకుల నుంచి గురుకుల సంస్థ దరఖాస్తులు ఆహ్వానించింది. హత్నురా జూనియర్ కాలేజ్, (బాలురు), శంకర్పల్లి (బాలురు) కాలేజీల్లో ఒకేషనల్ ట్రేడ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్( సిజిఏ) 2 పోస్టులు ఉన్నాయి. హత్నూర జూనియర్ కాలేజ్ ( బాలురు ), శంకర్ పల్లి (బాలురు), మణికొండ (బాలికలు), వర్ధన్నపేట ( బాలురు) కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ ( సిఎస్)లో 4 పోస్టు ఉన్నాయి. హత్నురా జూనియర్ కాలేజ్ (బాలురు), శంకర్పల్లి (బాలురు) కాలేజీల్లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ టెక్నీషియన్(ఐసిటి) లో 2 పోస్టులు ఉన్నాయి. కొండాపూర్ (బాలురు), న్యాల్కల్ (బాలురు) లో ఎలక్ట్రికల్ టెక్నీషియన్(ఈ టి)లో2 పోస్టులు ఉన్నాయి.
బంట్వరo ( బాలికలు), జగద్గిరి గుట్ట ( బాలికలు), హుస్నాబాద్ ( బాలురు)లో టూరిజం హాస్పిటాలిటీ మేనేజ్మెంట్( టి అండ్ హెచ్ ఎమ్)లో3 పోస్టులు, వికారాబాద్ ఆర్డిసి( బాలికలు), జగద్గిరిగుట్ట ఆర్డిసి ( బాలికలు)లో ఆఫీస్ అసిస్టెంట్ షిప్ (ఒఎ)లో 2 పోస్టులు, చింతకుంట ( బాలికలు), శంషాబాద్ ( బాలురు), ఆలేరు ( బాలికలు), మణుగూరు ( బాలురు)లో అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ ( ఎ అండ్ టి)లో 4 పోస్టులు, బద్దెనపల్లి ( బాలికలు)లో కమర్షియల్ గవర్నమెంట్ టెక్నాలజీలో ఒక పోస్టు, చింతకుంట ( బాలికలు), శంషాబాద్ ( బాలురు)లో ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్ (ఐ అండ్ ఎం)లో 2 పోస్టులు, మహాముబాబాద్ ఆర్డిసి లో ఫార్మా టెక్నాలజీ (పి.టి)లో ఒక పోస్టు ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. ఇంటర్వ్యూ, డెమో ఈ నెల 8న ఉదయం 9 గంటలకు రంగారరెడ్డి జిల్లా సరూర్ నగర్, సాంఘీక సంక్షేమ గురుకులం ( బాలికలు )లో ఉంటుందని,
అభ్యర్థులు తమ అర్హత పత్రాలతో హాజరుకావాలని సూచించారు. అర్హత వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://tgswreis.telangana.gov.in సందర్శించాలన్నారు. గౌరవ వేతనం గంటకు గరిష్టంగా రూ 400 వరకు చెల్లించనున్నారు. అనుభవాన్ని బట్టి నెలవారి చెల్లింపు గరిష్టంగా రూ .48 వేల వరకు ఉంటుందన్నారు. ఎంపికైన బోధకులు రెసిడెన్షియల్ కళాశాలలో విధులు నిర్వహించవలసి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు హెల్ప్ లైన్ నంబరు 040-23391598 ను సంప్రదించాలని సూచించారు.