Tuesday, August 5, 2025

శ్రీకృష్ణుడే మొదటి రాయబారి: సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, శ్రీ బాంకే బిహారీ టెంపుల్ ట్రస్ట్ వివాదంలో సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శ్రీకృష్ణుడే మొదటి రాయబారి అని, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలంటూ ఇరు పక్షాలకు సూచించింది. ఇందుకోసం ఓ కమిటీని ప్రతిపాదించింది. ఆలయ నిధుల నుంచి రూ.500 కోట్లతో కారిడార్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీనిని సవాల్ చేస్తూ కొందరు వ్యక్తులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ విచారణ సందర్భంగా శ్రీకృష్ణుడి రాయబారం గురించి సర్వోన్నత న్యాయస్థానం ప్రస్తావించింది. ఆర్డినెన్స్‌ను ఆమోదించడంలో తొందర ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీని రాజ్యాంగ బద్ధతను పరిశీలించాలని అలహాబాద్ హైకోర్టును ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News