Tuesday, August 5, 2025

మరిన్ని సుంకాలు విధిస్తాం.. భారత్‌కు ట్రంప్ వార్నింగ్

- Advertisement -
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా హెచ్చరిక
రష్యాతో చమురు వ్యాపారంపై ఆగ్రహం
రక్త పాతం జరుగుతుంటే ఇదేం పద్థతంటూ ఫైర్
వాషింగ్టన్: భారత్‌పై మరింతగా గణనీయ స్థాయిలో సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి పాతిక శాతం సుంకాల నిర్ణయం అమలులోకి వచ్చింది. 6వ తేదీ నుంచి భారతీయ సరుకులపై ఈ సుంకాల వసూళ్ల ప్రక్రియ ఆరంభమవుతోంది. ఈ దశలోనే ట్రంప్ తమ ట్రూత్ సోషల్ మీడియా ద్వారా భారత్‌పై తమ ఆగ్రహం తీవ్రతరం చేశారు. భారత్ చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. భారీ స్థాయిలో రష్యానుంచి క్రూడాయిల్ కొంటోంది. దీనిని అధిక లాభాలకు ఓపెన్ మార్కెట్‌లో అమ్ముకొంటోందని ట్రంప్ తెలిపారు. భార త్ భారీస్థాయిలో చమురు కోటాను తీసుకుంటూ ఉండటంతో రష్యా ఆర్థికవనరులు దెబ్బతినకుం డా ఉంటున్నాయి. వీటిని ఉక్రెయిన్‌పై సైనిక దాడులకు రష్యా వాడుకొంటోందని, పరిస్థితి తీవ్రత భారత్‌కు అర్థం అవుతోందా? అని ప్రశ్నించారు. రష్యా భీకరస్థాయిలో ఉక్రెయిన్‌తో యు ద్ధం సాగస్తోంది. ఎంతమంది రష్యా యుద్ధ యంత్రాలతో ఎంత మంది ఉక్రెయిన్లు బలి అవుతున్నారనేది భారత్ పట్టించుకొంటోందా? రక్తపా తం మాటున ఆయిల్ క్రయ విక్రయ బేరాలకు దిగుతోందని ట్రంప్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News