విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ’కింగ్డమ్’. (Kingdom)గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకష్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తాజాగా విడుదలైన ‘కింగ్డమ్’ చిత్రం.. ప్రేక్షకులను మెప్పు పొందుతూ భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మీడియాతో మాట్లాడుతూ “కింగ్డమ్ కథ రాసే సమయం లో కూడా కొన్ని టైటిల్స్ అనుకున్నాం. ఇందులో తెగ నాయకుడి పేరు ‘దేవర నాయక’. దాంతో అదే టైటిల్ పెట్టాలనుకున్నాం. కానీ, ఎన్టీఆర్ ‘దేవర’ రావడంతో.. మరో కొత్త టైటిల్ చూశాం. ‘యుద్ధకాండ’ అనే టైటిల్ ను పరిశీలించాం కానీ, చివరికి ’కింగ్డమ్’ని ఖరారు చేశాం. కింగ్డమ్ అయితే అన్ని భాషల ప్రేక్షకులకు చేరువవుతుందనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది.
మొదట విజయ్ దేవరకొండతో చేద్దామనుకున్న కథ వేరు. కానీ, మా ప్రయాణం మొ దలైన తరువాత.. ఆయనకి ఈ కథ సరిగ్గా సరిపోతుంది అని భావించి చెప్పడం జరిగింది. విజయ్‌కి కూడా ఈ కథ చాలా నచ్చింది. కింగ్డమ్ సినిమాలో యాక్షన్ ఉన్నప్పటికీ, దాని చుట్టూ బలమైన భావోద్వేగం (Strong emotion) ఉంటుంది. ఆ భావోద్వేగం కనెక్ట్ అయి ంది కాబట్టే యాక్షన్ వర్కవుట్ అయింది. ‘కింగ్డమ్’ చిత్రం ఇంతటి విజయం సాధించడానికి కారణం బలమైన భావోద్వేగాలే. శివ పాత్ర కోసం ముందు నుంచీ నేను స త్యదేవ్నే అనుకున్నాను. ఆయన కూడా కథ విని, సినిమా చేయడానికి వెంటనే అంగీకరించారు. ఇక రెండో భాగానికి సంబంధించిన మూల కథ ఉంది. స్క్రిప్ట్ వర్క్ కూడా త్వరలో ప్రారంభిస్తాం. అయితే పార్ట్- 2 కంటే ముందుగా.. మురుగన్, సేతు పాత్రల నేపథ్యంలో ఓటీటీ కోసం ఓ వెబ్ ఫిల్మ్ చేయాలని భావిస్తున్నాము”అని అన్నారు.