మన తెలంగాణ/హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఓ అభిప్రాయానికి వచ్చిన ట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా శుక్రవారం లేదా శనివారం ప్రభుత్వం కీలక నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం పై ఢిల్లీలో గత మూడు రోజులుగా ఆందోళనలు, విన్నపాలు చేస్తూ కాంగ్రెస్ నేతల ప్రయత్నాల అనంతరం రే వంత్ సర్కార్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వేదికగా తీవ్రస్థాయిలో నిరసన గ ళం విప్పారు. బిల్లుల ఆమోదం కోరుతూ రాష్ట్రపతిని కలవాలని సిఎం రేవంత్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు విశ్వప్రయత్నం చేసినప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ఈ పరిస్థితిలో రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదించక, రాష్ట్రపతి బిల్లులకు ఆమోద ముద్ర వేయకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటోంది. బిసిల రిజర్వేషన్ల విషయంలో రేవంత్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.
కాగా ప్రజలకు ఇచ్చిన వాగ్ధానం, అటు హైకోర్టు విధించిన స్థానిక ఎన్నికల గడువు సెప్టెంబర్ 30 దగ్గర పడుతుండడంతో ప్రభుత్వం మధ్యేమార్గంగా ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఢిల్లీలో తమ ముందు మూ డు ప్రతిపాదనలు స్థానిక ఎన్నికల నిర్వహణపై ఉన్నాయని వివరించారు. దీంతో రెండు దారులు మూసుకుపోవడంతో కాంగ్రెస్ పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే దిశగా నిర్ణయం తీసుకుననే అవకాశం ఉందని పా ర్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దాదాపు ఢిల్లీలోని కాం గ్రెస్ పెద్దలతో ఇదే అంశాన్ని చర్చించి నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇటు గవర్నర్ వద్ద ఆర్డినెన్స్, అటు రాష్ట్రపతి వద్ద బిల్లులు పెండింగ్, రాష్ట్రపతి అప్పాయింట్‌మెం ట్ ఇవ్వకపోవడం వంటి అంశాలన్నింటికి కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వమే కారణమని, రిజర్వేషన్లు తాము ఇవ్వాలని ప్రయత్నించినా బిజెపి అడ్డుకుంటోందని చెబుతూ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.