Friday, August 8, 2025

మూసీ గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: మూసీ ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. నీటి పారుదల అధికారులు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 4,136 క్యూసక్కులుండగా ఔట్‌ఫ్లో 4,738 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 643 అడుగులుకాగా పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు ఉంది. హైదరాబాద్ తో, యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. హిమాయత్‌సాగర్‌ నిండుకుండలాగా మారింది. ఒక గేటును అడుగు మేర ఎత్తి నీటిని మూసీ నదిలోకి వదిలారు. హిమాయత్‌సాగర్‌ ప్రస్తుత నీటిమట్టం 1762.7 అడుగులుకాగా పూర్తిస్థాయి నీటిమట్టం 1763.5 అడుగులుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News