- Advertisement -
రాష్ట్ర ఖజానాని ఎలా దోచుకోవచ్చో అనే విషయంలో కెసిఆర్ ప్రొఫెసర్ అని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. కెసిఆర్ కుటుంబ సభ్యులంతా దోచుకోవడంలో అలీబాబా నలభై దొంగల్లా మారారని, ఆ నలభై మందిలో కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఒకరని ఆయన విమర్శించారు. దొంగలు మీరైతే, నిందలు మాపై వేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోనే 30 వేల కోట్లు మిగుల్చుకున్నారని ఆయన విమర్శించారు. విద్యుత్తు కొనుగోలు, ఇసుక మాఫియా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని ఆయన విమర్శించారు.
- Advertisement -