సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చంబా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్వాస్ తిస్సా ప్రాంతంలో కారు రాయిని ఢీకొట్టి లోయలో పడడంతో ఆరుగురు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శుక్రవారం రాత్రి రాజేష్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తున్నాడు. చిన్వాస్ తిస్సా ప్రాంతంలో కొండ మీదకు చేరుకున్న కారు అదుపుతప్పి రాయిని ఢీకొట్టింది. కారు 500 మీటర్ల లోతుగల లోయలో పడిపోవడంతో ఆరుగురు ఘటనా స్థలంలో మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను లోయలో నుంచి బయటకు తీశారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం చంబా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సిమ్లా జిల్లాలో చిరాగామ్ ప్రాంతంలో రెండు రోజుల క్రితం జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే
లోయలో పడిన కారు: ఆరుగురు మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -