Saturday, August 9, 2025

ధర్మస్థలిలో 500 మంది అమ్మాయిలపై అత్యాచారం చేసి చంపేశారు: నారాయణ

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల శ్రీవారిని సిపిఐ నేత నారాయణ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతోమ మాట్లాడారు. ధర్మస్థలిలో సుమారు 500 మంది అమ్మాయిలపై అత్యాచారం చేసి చంపేశారని ఆరోపణలు చేశారు. ధర్మస్థల ఆలయ ట్రస్టు చైర్మన్‌గా ఉన్న వ్యక్తిని బిజెపి రాజ్యసభకు ఎంపిగా నామినేట్ చేసిందన్నారు. ఒక సిపిఎం నాయకుడు దీనిపై పోరాటం చేసినప్పుడు అతడి 17 ఏళ్ల కూతురుపై అత్యాచారం చేసి హత్య చేశారని మండిపడ్డారు. గుడి లోపల మృతదేహాలు, ఎముకలు బయటపడ్డాయని, ఇది స్మశాన వాటికా లేక దేవాలయమా అని ప్రశ్నించారు. ధర్మస్థల ట్రస్టీ అనేది ఓ కుటుంబం చేతిలో ఉందన్నారు. ధర్మస్థలికి వంద కోట్ల రూపాయలు ఆదాయం కూడా వస్తుందని, పది వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయని నారాయణ వివరించారు.

కర్ణాటక రాష్ట్రం నేత్రావతి నది పక్కన ధర్మస్థల ప్రాంతంలో 1998 నుంచి 2014 మధ్య వందలాది శవాలు పూడ్చిపెట్టామని ఒకప్పటి శానిటైజేషన్ కార్మికుడు భీమ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో దేశం వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు సిరీయస్ గా తీసుకున్న కర్నాటక ప్రభుత్వ దర్యాప్తు సిట్ ను ఏర్పాటు చేసింది. భీమా 13 ప్రాంతాలలో శవాలను పూడ్చి పెట్టినట్టు తెలిపాడు. సిట్ అధికారులు 12 ప్రాంతాలలో తవ్వకాలు జరపగా ఒక ప్రాంతంలో ఎముకలు దొరకడంతో పాటు మరో ప్రాంతంలో ఉరి వేసుకున్న వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News