Friday, September 19, 2025

నిద్రపోతున్న బిడ్డను సరస్సులో పడేసిన కసాయి తల్లి

- Advertisement -
- Advertisement -

జైపూర్: ప్రియుడి మాటలు విని కన్నతల్లి బిడ్డ నిద్రలోకి జారుకున్న తరువాత పసిపాపను సరస్సులో పడేసింది. ఈ సంఘటన రాజస్థాన్ అజ్‌మేర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అంజలి అనే వివాహిత భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా మూడేళ్ల కూతురుతో కలిసి ఉంటుంది. అఖిలేశ్ అనే యువకుడు పరిచయం కావడంతో అతడితో అంజలి సహజీవనం చేస్తోంది. ఇద్దరికి పాప అడ్డుగా ఉండడంతో కూతురు చంపాయేలని ప్లాన్ వేశారు. ప్రియుడి చెప్పిన విధంగా పాపను అన్నా సాగర్ సరస్సు వద్దకు తీసుకెళ్లి సరస్సు చుటూ తిప్పుతూ కబుర్లు చెప్పింది. పాప నిద్రలోనికి జారుకున్న తరువాత అన్నాసాగర్ సరస్సులో పడేసింది. పోలీసులు పాప మృతదేహం కనిపించడంతో కేసు నమోదు చేసి స్థానిక సిసి కెమెరాలను గమనించారు. అంజలిగా గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకుంది. వెంటను ఆమెతో ప్రియుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: హైదరాబాద్ విలవిల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News