Friday, September 19, 2025

నటుడు రోబో శంకర్ ఇకలేరు

- Advertisement -
- Advertisement -

చెన్నై: కోలీవుడ్ హాస్య నటుడు రోబో శంకర్ (46) (Robo Shankar Passes Away) కన్నుమూవారు. ఆయన గత కొన్ని రోజల నుంచి కామెర్లు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐసియులో చికిత్స పొందుతూ శంకర్ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు శంకర్ కిందపడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు (Robo Shankar Passes Away) చనిపోయాడు. ఓ ప్రైవేటు టివి చానెల్‌లో మిమిక్రీ ద్వారా బుల్లితెరపై సందడి చేశారు. రోబో తరహాలో నృత్యం చేయడంతో ఆయనను రోబో శంకర్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునేవారు. సింగం3, పులి, విశ్వాసం అనే సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. శంకర్‌కు భార్య, కూతురు ఉన్నారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, రాజ్యసభ సభ్యుడు ఎంపి కమల్ హాసన్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Also Read: హైదరాబాద్ విలవిల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News