Friday, September 19, 2025

‘కిష్కింధపురి-2’ తప్పకుండా వస్తుంది

- Advertisement -
- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్‌బస్టర్ ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. హీరో సాయి దుర్గతేజ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాబీ, వశిష్ట, అనుదీప్ అతిధులుగా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. సక్సెస్ మీట్‌లో హీరో సాయి దుర్గతేజ్ మాట్లాడుతూ “కిష్కింధపురి సినిమా అద్భుతంగా ఆడుతోంది. మంచి కంటెంట్‌ని ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు.

ఇంత మంచి హిట్ అందుకున్న కిష్కింధపురి టీమ్ అందరికీ శుభాకాంక్షలు”అని తెలిపారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ “కౌశిక్ అద్భుతంగా ఈ సినిమాను తీశాడు. ఇక్కడ నుంచి తను సక్సెస్ ని కొనసాగిస్తాడని కోరుకుంటున్నాను”అని పేర్కొన్నారు. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ “కిష్కింధపురి థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా. అందరూ థియేటర్స్‌కి వచ్చి సినిమాను చూసి సపోర్ట్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఇది అందరిని అలరించే సినిమా”అని అన్నారు. నిర్మాత సాహూ గారపాటి మాట్లాడుతూ “కౌశిక్ అనుకున్న కథ స్క్రీన్ మీదకి ఒక హాలీవుడ్ సినిమా స్థాయిలో వచ్చింది.

ఆడియన్స్ కూడా అదే థ్రిల్ ఫీల్ అవుతున్నారు. సాయి శ్రీనివాస్, అనుపమ అద్భుతంగా నటించారు”అని తెలియజేశారు. డైరెక్టర్ కౌశిక్ మాట్లాడుతూ “డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు హ్యాపీగా ఉండటమే రియల్ సక్సెస్. ఈ సినిమా అలాంటి ఆనందాన్ని ఇచ్చింది. కిష్కింధపురి పార్ట్ 2 ఎప్పుడు అని అడుగుతున్నారు. ఐడియా ఉంది… తప్పకుండా ఆ సినిమా వస్తుంది”అని తెలిపారు. ఈ వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.

Also Read : కలి పురుషుడు, అమ్మవారికి మధ్య జరిగే పోరాటం

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News