- Advertisement -
అబుదాబి: ఆసియాకప్ గ్రూప్‌ఎలో భాగంగా శుక్రవారం జరిగే మ్యాచ్‌లో ఒమన్‌తో టీమిండియా తలపడనుంది. భారత్ ఇప్పటికే సూపర్4కు అర్హత సాధించింది. ఇదే గ్రూపు నుంచి పాకిస్థాన్ కూడా నాకౌట్‌కు చేరుకుంది. ఒమన్ ఇప్పటికే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఒమన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. ఒమన్‌కు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. భార త్‌కు ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాల్సిందే.
Also Read: హైదరాబాద్ విలవిల
- Advertisement -