- Advertisement -
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కోకాపేటలో దంపతుల మధ్య జరిగిన గొడవలో భర్త చనిపోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గురువారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. భార్య కత్తి తీసుకొని భర్తపై దాడి చేయడంతో కిందపడిపోయాడు. ఇంట్లో నుంచి కేకలు రావడంతో స్థానికులు గమనించి అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దంపతులు అస్సాంకు చెందిన వారిగా గుర్తించారు.
- Advertisement -