- Advertisement -
అమరావతి: టిడిపి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గత వైసిపి ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులకు ప్రజాధనం ధారాదత్తం చేసిందని ఎపి మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆరోగ్యశ్రీని దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ వైద్యసేవగా మారిందని సభకు మంత్రి సత్యకుమార్ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఎపి శాసన సభలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 457 కోట్లు చెల్లింపులు చేసిందని, ఆరోగ్యశ్రీని నిలిచిపోయిందనడంలో వాస్తవం లేదని, పేరు మాత్రమే మారిందని సత్యకుమార్ తెలియజేశారు. ఎన్టిఆర్ వైద్యసేవ ద్వారా 13 లక్షల 42 వేల మంది లబ్ధి పొందారని, ఎన్టిఆర్ వైద్య సేవ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులకు బాకాయిలు చెల్లించాలని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
Also Read : నేడు ఒమన్‌తో భారత్ ఢీ
- Advertisement -