అమరావతి: ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు త్వరలో యాక్షన్ ప్లాన్ చేస్తున్నామని ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ప్లాస్టిక్ రహిత ఎపి కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ఎపి శాసనసభలో ఆయన ప్లాస్టిక్ నిషేధంపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి ప్రశ్నకు పవన్ సమాధానం ఇచ్చారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పౌరులను భాగస్వామ్యం చేస్తున్నామని, ప్లాస్టిక్ నియంత్రణలో ప్రజలు ముందుకు రావాలని సూచించారు. మన జీవితాల్లో ప్లాస్టిక్ ఓ భాగం అయిపోయిందని, ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తాం అని తెలియజేశారు. తిరుమలలో క్రమశిక్షణతో ప్లాస్టిక్ నిషేధం అమలు అవుతోందని, ప్లాస్టిక్ నియంత్రణ రాజకీయ నేతల నుంచే ప్రారంభం కావాలని అన్నారు. ఫ్లెక్సీల వాడకం విచ్చల విడిగా పెరిగిపోయిందిని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Also Read : ఆరోగ్యశ్రీ ఎన్టిఆర్ వైద్యసేవగా మారింది: సత్యకుమార్