Saturday, September 20, 2025

ఎపి విద్యార్థులకు గుడ్ న్యూస్

- Advertisement -
- Advertisement -

అమరావతి: దసరా పండగ సందర్భంగా విద్యార్థులకు ఎపి ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ తెలిపింది. ఉపాధ్యాయుల కోరిక మేరకు మరో రెండు రోజులు స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా సెలవులు మంజూరు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్‌ అధికారిక ప్రకటన చేశారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 24 నుంచి అక్టోబర్‌ 2 వరకు దసరా సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మార్పు చేయడంతో ఎపిలో పాఠశాలలకు మరో రెండు రోజులు అదనంగా సెలవులు వచ్చాయి. పాఠశాల సెలవులు పొడిగించాలని మంత్రి లోకేశ్ ను టిడిపి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలు కోరారు. దీంతో వారి కోరిక మేరకు విద్యాశాఖ అధికారులతో చర్చించి ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రకటించింది.

Also Read: మావోయిస్టు పార్టీలో ముసలం!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News