- Advertisement -
హైదరాబాద్: భర్త ఆత్మహత్య చేసుకున్న చెరువులోనే భార్య దూకడంతో ఆమెను పోలీసులు కాపాడారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కుటుంబ కలహాలతో శనివారం భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మృతదేహం కోసం పోలీసులు, ఎన్ డిఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అదే సమయంలో భార్య కూడా చెరువులో దూకింది. వెంటనే ఎన్డిఆర్ ఎఫ్ సిబ్బంది ఆమెను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
Also Read: తెలంగాణలో రీడింగ్ క్యాంపెయిన్
- Advertisement -