Saturday, September 20, 2025

జిఎస్టి తగ్గింపుతో ముందే దసరా, దీపావళి : చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: రౌడీయిజం చేసినా.. విధ్వంసం చేసినా.. చూస్తూ ఊరుకోను అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మాచర్లలో అందరూ సంతోషంగా ఉన్నారని, ఇది శాశ్వతం కావాలని అన్నారు. మాచర్లలో చాలా మంది అరాచకాలు చేశారని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మాచర్లలో సిఎం మీడియాతో మాట్లాడుతూ..మీ పరిసరాల్లోని చెత్తనే కాదు.. రాజకీయ చెత్తనూ తొలగించాలని, జిఎస్టి తగ్గింపుతో ముందే దసరా, దీపావళి వచ్చాయని తెలియజేశారు. నిత్యావసర ధరలు అందుబాటులోకి వచ్చాయని, ప్లాస్టిక్ వినియోగం వల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని చెప్పారు. పాత వస్తువులు ఇచ్చిన వారికి నిత్యావసర వస్తువులు ఇస్తామని, త్వరలో సంజీవని కార్యక్రమం తీసుకొస్తామని అన్నారు. ఆరోగ్య బీమాకు సాంకేతిక సాయం చేసేందుకు బిల్ గేట్స్ ముందుకొచ్చారని, 2047 కల్లా రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం ఉండేలా ప్రణాళికలు వేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని, 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, పక్కనే నాగార్జున సాగర్ ఉన్నా మాచర్లకు తాగునీటి సమస్య ఉందని అన్నారు. కేంద్రంతో మాట్లాడి చిల్లీ బోర్డు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని, వ్యవసాయంలో పురుగుమందుల వినియోగం బాగా తగ్గాలని అధికారులకు సూచించారు. యూరియా వల్ల వ్యాధులు పెరుగుతాయని.. పంజాబ్ పరిస్థితి చూశామని, మాచర్లకు వందపడకల ఆస్పత్రి మంజూరు చేస్తున్నానని వెల్లడించారు. పల్నాడు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని, ఇప్పుడు మాచర్లకు ఎవరైనా స్వేచ్ఛగా వచ్చే పరిస్థితి కల్పించామని చెప్పారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు రూ. వేలు ఇస్తున్నామని అన్నారు.

మీ ఇళ్ల వద్దకు వాహనాలు పంపిస్తామని..పాత వస్తువులు ఇవ్వండని, విశాఖ, గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఉన్నాయని అన్నారు. త్వరలో రాజమండ్రి, నెల్లూరు, కడప, కర్నూలులో ప్లాంట్లు నిర్మిస్తామని, సంజీవని ప్రాజెక్టు ప్రారంభించబోతున్నామని తెలిపారు. ధనిక, పేద తేడా లేకుండా అందరికీ రూ. 2.5 లక్షల ఆరోగ్య బీమా ఇస్తున్నామని, పేదవారికి దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ వైద్యసేవ కింద రూ. 25 లక్షల వరకు ఆరోగ్య బీమా అందజేస్తామని అన్నారు. మాచర్లను మోడల్ మున్సిపాలిటీగా మారుస్తామని, పశువులకు హాస్టళ్లు నిర్మిస్తామని.. అన్నింటిని అక్కడికే తరలిస్తామని చెప్పారు. పశువులకు షెడ్లు కట్టిస్తామని.. గడ్డి అక్కడికే పంపిస్తామని, పల్నాడు జిల్లాలో పేదరికం తగ్గేందుకు ప్రత్యేక నిధులు ఇస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Also Read : భారతీయులకు షాక్ ఇచ్చిన ట్రంప్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News