- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు కుక్కును తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు లక్ష్మణ్(70), సుబ్బాయమ్మ(65), హేమంత్(25)గా గుర్తించారు. లక్ష్మణ్- సబ్బాయమ్మ కుటుంబం తిరుపతి నుంచి పిఠాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Also Read: అధికారం అందుకోవడానికి రోడ్‌మ్యాప్ సిద్ధం
- Advertisement -