రంగారెడ్డి: హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. శనివారం అర్థరాత్రి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది… మహ్మద్ అబ్దుల్ నజీర్ ఫహద్(22), మహ్మద్ అబ్దుల్ ఆహదుద్దీన్ ఖాన్(25) అనే యువకులు స్కూటీపై టోలీచౌకీ నుంచి గచ్చిబౌలి వెళ్తున్నారు.
Also Read: అక్కడి జంగ్ సైరన్ ఇక్కడా మోగుతుందా?
రాయదుర్గంలోని హనుమాన్ టెంపుల్ సమీపంలో వెనుక నుంచి అతి వేగంగా స్కూటీని టయోటా కరోలా అల్టీస్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నజీర్ ఫహద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన అబ్దుల్ అహదుద్దీన్ ఖాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన సాఫ్ట్వేర్ ఉద్యోగి కార్తీక్ను రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులు టోలీచౌకీకి చెందిన వారిగా గుర్తించారు.