మన తెలంగాణ/పాలకవీడు: అల్మట్టి డ్యాం ఎత్తు పెంచడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా, పాలకవీడు మండలం, జాన్‌పహాడ్ గ్రామంలో కృష్ణానదిపై నిర్మిస్తున్న జవహర్ జాన్‌పహాడ్ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి నది జలాల పంపిణీలో న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని తేల్చిచెప్పారు. కృష్ణానది జలాల పంపకంలో గత పాలకులు పదేళ్లు నిర్లక్షం చేయడంతో కృష్ణానదిలో 811 టిఎంసిలలో ఆంధ్రప్రదేశ్‌కు 512టిఎంసిలు, తెలంగాణకు 299 టిఎంసిలకు రాతపూర్వకంగా ఒప్పుకున్నారని తెలిపారు.
కానీ తాము అధికారంలోకి వచ్చాక నదీ పరివాహక ప్రాంతం ఆయకట్టు జనాభాను పరిగణనలోకి తీసుకొని నీటి కేటాయింపులు చే యాలని కోరామని తెలిపారు. దీని ప్రకారం తె లంగాణకు 70 శాతం జలాలు కేటాయించాలని పోరాడుతున్నామని అన్నారు. ఇప్పటికే ఒకసారి ట్రిబ్యునల్ ముందు తమ వాదనలు వినిపించామని, మళ్లీ ఈనెల 22వ తేదీ రాత్రి మరోసారి ఢిల్లీ వెళ్లి తెలంగాణకు న్యాయం జరిగేలా వాదనలు వినిపిస్తామని స్పష్టం చేశారు. ఇదిలావుండగా, తుమ్మడిహట్టి వద్ద ప్రాణహిత=చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించేందుకు తమ ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉందని, త్వరలోనే కార్యాచరణ మొదలు పెడతామని తెలిపారు. గత పాలకులు లక్ష కో ట్లతో కాళేశ్వరం పేరుతో మూడు బ్యారేజీలు నిర్మిస్తే మూడేళ్లకే కూలిపోయాయని, ఎన్డిఎస్ఏ నివేదిక ప్రకారం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేసేందుకు ముందుకు వెళ్తామని వెల్లడించారు. జవహర్ జాన్‌పహాడ్ లిప్టు ఇరిగేషన్ పనులు యుద్ధప్రాతిపదికన నాణ్యత పాటిస్తూ వేగవంతం గా పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు జవహర్ జాన్‌పహాడ్ లిప్టు ఇరిగేషన్ స్కీంను రూ.302 కోట్లతో నిర్మిస్తున్నామని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మండలంలోని, రాఘవాపురం, అలింగాపురం, కోమటికుంట, మీగడ పహాతండా చెరువు తండా, పాలకవీడు, హనుమయ్యగూడెం, నాగిరెడ్డిగూ డెం, సజ్జాపురం గ్రామాల్లోని పది వేల ఎకరాలకు సాగునీరు, జాన్‌పహాడ్ చెరువుకి నీరు అందిస్తామని తెలిపారు. లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణలో రైతులకు న్యా యం జరిగేలా పూర్తిచేయాలని ఆర్‌డిఒను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఇఎన్సి రమేష్‌బాబు, జిల్లా ఎస్పి నరసింహా, ఆర్‌డిఒ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఎస్ఇ నాగభూషణం, డిజి సత్యనారాయణ, కాంట్రాక్టర్ శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎన్వి సుబ్బారావు, పార్టీ సీనియర్ నాయకుడు మాలోతు మోతిలాల్‌నాయక్, మాజీ ఎంపిపి భూక్య గోపాల్‌నాయక్, కొణతం చిన్న వెంకటరెడ్డి, నూకల సందీప్‌రెడ్డి, బెల్లంకొండ నరసింహారావు, బ్లాక్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు తీగల శేషురెడ్డి, రమావత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: ప్లాన్ బీ అవసరమే!