హైదరాబాద్: ‘‘ఈ ప్రభుత్వం పేదల ఇళ్లను ఎందుకు కూల్చివేస్తోంది?’’ అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నిలదీశారు. సెలవుల్లో కూల్చివేతలు వద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పిందని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కార్యకర్తలతో కెటిఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఆదివారం గాజుల రామారాంలో సెలవురోజునే పేదల ఇళ్లు కూల్చారని మండిపడ్డారు. రేపు జూబ్లీహిల్స్ లోని బోరబండకు కూడా సిఎం రేవంత్ రెడ్డి హైడ్రాతో వస్తారని, కాంగ్రెస్ కు ఓటు వేస్తే బుల్డోజర్ రాజ్యానికి లైసెన్స్ ఇచ్చినట్లేనని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ స్థలాలు, చెరువుల్లో ఇళ్లు కట్టిన కాంగ్రెస్ నేతల జోలికి వెళ్లడం లేదని కెటిఆర్ అన్నారు. బిఆర్ఎస్ కార్యకర్త సర్దార్ ఇంటిని ప్రభుత్వం కూల్చివేసిందని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ కార్యకర్త సర్దార్ కు మళ్లీ ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తనది అని కెటిఆర్ హామి ఇచ్చారు.
Also Read : సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్న సీతక్క