Monday, September 22, 2025

వైసిపి చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: లోకేష్

- Advertisement -
- Advertisement -

అమరావతి: శాసనసభకు రావాల్సిన బాధ్యత మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి కు లేదా? అని ఎపి మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. పులివెందుల సమస్యలైనా సభ దృష్టికి తేవాలి కదా అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..కులాలు, ప్రాంతాలు మధ్య చిచ్చుపెట్టాలని చేసే పార్టీ వైసిపి అని వైసిపి చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగన్ ఎక్కడికైనా వెళ్లవచ్చు.. హౌస్ అరెస్టులు ఏమీ ఉండవని తెలియజేశారు. పెట్టుబడిదారులను భయపెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.

సిఎం చంద్రబాబు నాయుడుకు ఈ వారం అంతా బిజీ షెడ్యూల్ ఉందని, ఎక్కువగా తిరగడం మంచిది కాదని చెప్పినా ఆయన వినడం లేదని పేర్కొన్నారు. జిఎస్టిపై అక్టోబర్ లో వరుస కార్యక్రమాలు జరుగుతాయని, 50 వేల కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచన చేస్తోందని అన్నారు. సూపర్ జిఎస్టి సూపర్ సేవ్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తామని,  అక్టోబర్ 19 నాటికి కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు.

Also Read : ఐటి రంగంలో భారతీయులకు చాలా నైపుణ్యం ఉంది: చంద్రబాబు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News