పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఒజి’ (OG Movie). గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ మూవీని దర్శకుడు సుజీత్ తెరకెక్కించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. భారీ అంచనాలతో ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేసింది.
సినిమా (OG Movie) ఒరిజినల్ రన్‌టైమ్ 156.10 నిమిషాలు కాగా.. సెన్సార్ తర్వాత 154.15కు కుదించారు. సెన్సార్ బోర్డు చెప్పిన మార్పుల ప్రకారం రన్‌టైమ్ తగ్గింది. స్మోకింగ్ సీన్‌కు సంబంధించి డిస్క్లయిమర్ ప్రదర్శనతో పాటు వాయిస్ ఓవర్ ఇవ్వడం లాంటి సూచనలతో పాటు రక్తపాత సన్నివేశాలను ట్రిమ్ చేయమని సెన్సార్ బోర్డు చెప్పగా.. చిత్ర యూనిట్ తగిన మార్పులు చేసింది. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా.. శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.
Also Read : ‘కాంతార ఛాప్టర్-1’ ట్రైలర్.. నిజంగా విజువల్ ట్రీట్..