Tuesday, September 23, 2025

బతుకమ్మ వేడుకలపై పోలీసుల ఆంక్షలా?: రాంచందర్ రావు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః బతుకమ్మ వేడుకలపైనా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. బిజెపి మహిళా మోర్చా రూపొందించిన బతుకమ్మ సంబరాల పోస్టర్‌ను పార్టీ కార్యాలయంలో సోమవారం రాంచందర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రభుత్వ చర్యను తూర్పారబట్టారు. బతుకమ్మ వేడుకలకు కొన్ని చోట్ల అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టుకు వెళ్ళి అనుమతి పొందాల్సి వచ్చిందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని చెప్పుకునే ప్రభుత్వం ఈ రకంగా మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతం రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News