Tuesday, September 23, 2025

హైదరాబాద్ లో దంచి కొట్టిన వాన.. రోడ్లన్నీ నదులాయే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో మరోసారి కుండపోత వాన
స్తంభించిన వాహనాల రాకపోకలు
పలు ప్రాంతాల్లో కొట్టుకుపోయిన వాహనాలు
బంజారాహిల్స్‌లో 10.15 సెం.మీటర్ల వర్షపాతం

మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో సోమవా రం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఆకాశమం తా మేఘావృతమై కుండపోతగా వర్షం పడింది. ఏకంగా 10.15 సెం.మీ.లుగా భారీగా వాన కురవడంతో నగర రోడ్లు నదులుగా మారాయి. లోతట్టు ప్రాంతాలు జలాశయాలుగా మారా యి. బంజారాహిల్స్ హకీంపేట్‌లో ఓ గోడకూలింది. పలు వాహనాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నగర వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారిం ది. గంటలకొద్ది రోడ్లపైనే వానల్లోనే వాహనాలు నిలిచి ప్రయాణికులు, వాహనదారులు అవస్థలకు గురయ్యారు.

బంజారాహిల్స్ లో 10.15 సెం.మీ.లు. శ్రీనగర్ కాలనీలో 9.5 సెం.మీ.లు, ఖైరతాబాద్ పరిధిలో 8.5 సెం.మీ.లుగా వర్షపాతం నమోదైంది. దీంతో రాజ్‌భవన్‌రోడ్, పంజాగుట్ట, లకిడీకాపూల్, సెక్రటరియే ట్ ఖైరతాబాద్ కూడలి, ఐటికారిడార్, మాదాపూర్ ప్రాంతాల్లో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. వాహనాలు బంపర్ టు బంపర్ అన్నట్టుగా కిక్కిరిసిపోయి, ట్రాఫిక్‌లోనే చిక్కిపోయాయి. ఒక కిలోమీటర్ వెళ్ళేందుకు కనీసంగా గంట సమ యం పట్టింది. నగరంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.

మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాంక్, టోలిచౌక్, వనస్థలిపురం ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. కూకట్‌పల్లి, మియాపూర్, అమీర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీ నగర్ వంటి ప్రాంతాల్ల్లో రహదారులపై వరదనీరు నిలిచిపోయింది. నగరవ్యాప్తంగా క్యూమిలో నింబస్ మేఘాల వల్ల కురిసిన వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి తేలికపాటి జల్లులు పడుతుండగా.. ఆ తర్వాత జోరువానగా మారింది. బేగంపేట, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా, డి ఆర్‌ఎఫ్, ట్రాఫిక్ సిబ్బందిని ఐఎండి అప్రమత్తం చేసింది ఎల్బీనగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్‌లో భారీగా వర్షం పడింది.

Also Read: అల్పపీడన ప్రభావం.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News