బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. మంగళవారం 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించారు. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. ‘జవాన్’ సినిమాలో నటనకు గానూ షారుఖ్ ఖాన్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయ్యారు. ఇవాళ రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. తన 30 ఏళ్ల సినీ కెరీర్‌లో తొలిసారిగా జాతీయ అవార్డును అందుకున్నారు షారుఖ్. ఈ వేడుకలో క్లాసిక్ బ్లాక్ సూట్, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌తో షారుఖ్ ఖాన్ తన అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆయన తొలిసారి జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా, తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ, షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ‘జవాన్‘. 2023లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రంలో నయనతార, దీపికా పదుకొనే, సన్యా మల్హోత్రా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Also Read: ఒకే జిమ్‌లో రాజ్ నిడమోరుతో సమంత..