Wednesday, September 24, 2025

మల్లోజుల విప్లవ ద్రోహి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కాల్పుల విరమణ, శాంతి చర్చలపై మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి చేసిన ప్రకటనను మావోయిస్టులు తీవ్రంగా ఖండించారు. భూపతి ఆడి యో, వీడియోలపై మావోయిస్టు కేంద్ర కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మల్లోజుల వేణుపై మం డిపడింది. వేణుగోపాల్ లొంగిపోయేందుకే ఆరోపణలు చేస్తున్నారని మావోయిస్టు కేంద్రకమిటీ తాజాగా విడుదల చేసిన మరో ప్రకటనలో పేర్కొంది. అలాగే, వేణుగోపాల్ అలియా స్ భూపతి వద్డ ఉన్న ఆయుధాలు పార్టీకి అప్పజెప్పాలని ఆదేశించింది. లేదంటే వాటిని పీపు ల్స్ గొరిల్లా ఆర్మీ స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించింది. మల్లోజుల వేణుగోపాల్‌ను విప్లవ ద్రోహిగా ఆరోపించింది. ప్రభుత్వానికి లొంగిపోవాలనుకుంటే లొంగిపోవచ్చు కానీ ద్రోహానికి పాల్పడవద్దని మండిపడింది. ఆయుధాలు వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి హోదాలో అభయ్ పేరుతో మల్లోజుల వేణుగోపాల్ విడుదల చేసిన లేఖను ప్రస్తావిస్తూ మావోయిస్టు పార్టీ తాజాగా మరో లేఖను విడుదల చేసింది. గతంలో అభయ్ పేరిట విడుదల చేసిన లేఖను మావోయిస్టు కేంద్ర కమిటీ తప్పుబట్టింది. పార్టీపై వేణుగోపాల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తింది. కాల్పుల విరమణ, శాంతి చర్చలంటూ కేంద్ర కమిటీని సంప్రదించకుండా అభయ్ ఏ విధంగా ప్రకటన విడుదల చేశారని నిలదీసింది.

మారిన జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పోరా టం కొనసాగించే తీరుతామని, అమరుడైన పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు శాంతి చర్చల కోసం చేసిన ప్రయత్నంలో భాగమే ఆయుధాల అప్పగింత అని సోను ప్రకటించడం వాస్తవాలను వక్రీకరించడమేనని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ప్రభుత్వం ముందు లొంగిపోవడానికే ఆయన ఇలాంటి ప్రకటన చేస్తున్నారని దుయ్యబట్టిం ది. అభయ్ పేరుతో ఈ నెల 16న లేఖ విడుదలైన విషయం విదితమే. మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావుకు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి సోదరు డు. ఇలా ఉండగా, ప్రధాన స్రవంతిలో చేరాలని ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి, పోలీ సు అధికారులు నిరంతరం చేస్తున్న అభ్యర్థనల దృష్టా తమ పార్టీ ఆయుధాలను వదులుకోవాలని నిర్ణయించిందని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట విడుదలైన లేఖ లో పేర్కొన్న విషయం తెలిసిందే. సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ప్రకటించాలని తమ పార్టీ నిర్ణయించుకున్నట్లు ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

ఆయుధాలు వదిలిపెట్టడం అంటే వాటిని శత్రువుకు అప్పగించడంమని, శత్రువుకు లొంగిపోవడం (సరెండర్) అని అర్థమని మావోయిస్టు కేంద్ర కమిటీ స్పష్టం చేసింది. శత్రువుకు ఆయుధాలను అప్పగించి, లొంగిపోయి తాత్కాలిక సాయుధ పో రాట విరమణ పోరాటాన్ని విరమించడం అం టే విప్లవ పార్టీ రివిజనిస్టు పార్టీగా మారిపోవడమే అవుతుందని వివరించింది. ఆయుధాల్ని శత్రువుకు అప్పగించి లొం గిపోవడం అంటే అమరులకు, దేశంలోని విశా ల ప్రజలకు (పీడిత వర్గాలు, పీడిత సాంఘిక సముదాయాలు, పీడిత జాతులు) ద్రోహం చే యడమే అవుతుందని వెల్లడించింది. ఇది ప్ర చండ తరహా ఆధునిక రివిజనిజం, విప్లవ ద్రో హం అని వెల్లడించింది. అందుకే, ఆయుధాల్ని శత్రువుకు అప్పగించి, శత్రువుకు లొంగిపోవడాన్ని సిద్ధపడుతున్న సోనూ విప్లవ ద్రోహాన్ని పార్టీ సభ్యులు, అన్ని స్థాయిల పార్టీ కమిటీలు, జైల్లోని పార్టీ సభ్యులు, పార్టీ నాయకులు, విప్లవాభిమానులు త్రీవంగా ఖండించాల్సిందిగా కోరింది. ఆయన, ఆయన అనుచరులు శత్రువుకు లొంగిపోదల్చుకుంటే లొంగిపోవచ్చు, కానీ పార్టీకి చెందిన ఆయుధాల్ని శత్రువుకు అప్పగించే అధికారం వీళ్లకు లేదని, అందుకే వాటిని పార్టీకి అప్పగించాల్సిందిగా డిమాండ్ చేసింది.

ఒకవేళ వాళ్లు సామరస్యపూర్వకంగా అప్పగించకపోతే వారి నుండి ఆయుధాల్ని స్వాధీనం చేసుకోవాల్సిందిగా పి.ఎల్.జి.ఎను నిర్దేశిస్తున్నామని పేర్కొంది. సాయుధ పోరాటాన్నే తిరస్కరిస్తున్న ఆయన తాత్కాలిక సాయుధ పోరాట విరమణ అని ప్రకటించడం మోసకారితనమే అవుతుందని, ఆయన అనుసరించదలుచుకున్న మార్గం పార్లమెంటరీ పంథానే అవుతుందని, అందుకే అది ప్రచండ తరహా నయారివిజనిజం అవుతుందని వెల్లడించింది.

Also Read: స్థానిక ఎన్నికల ముందే కులగణన వివరాలు ప్రకటించాలి: కల్వకుంట్ల కవిత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News