Thursday, September 25, 2025

ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌పై కార్మికుల దాడి

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్‌లోని ప్యాట్నీ కూడలి వద్ద విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రఘునందన్‌పై ఇద్దరు కార్మికులు దాడి చేయడంతో కలకలం రేగింది. ప్యాట్నీ కూడలిలోని ఓ షాపింగ్ మాల్‌లో గత కొన్ని రోజులుగా మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది. రహదారిపై నిలిపి ఉంచిన ఆటోను తొలగించాలని, ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సూచించారు. దీంతో ఆగ్రహించిన ఇద్దరు కార్మికులు ఆయనను దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సంఘటనపై మోండా మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News