Thursday, September 25, 2025

దసరా కానుకగా ‘పెద్ది’ సాంగ్?

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పెద్ది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కి లారు భారీగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన పెద్ది గ్లింప్స్ అదిరిపోయింది. అయితే దసరాకి ఒక సాంగ్ లేదా పోస్టర్ ఏదైనా వదిలే ప్లానింగ్‌లో ఉన్నారట మేకర్స్. పెద్ది సినిమా విషయంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమాను 2026 మార్చి 26న విడుదల చేయాలని అనుకున్నారు.

అయితే అనుకున్న విధంగా అవుట్ పుట్ వచ్చిన తర్వాతే సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. తాజా సమాచారం ప్రకారం పెద్దిని 2026 ఫస్ట్ హాఫ్‌లో కన్నా సెకండ్ హాఫ్ రిలీజ్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా సమ్మర్‌లో రిలీజ్‌కు ఉంది. అందుకే సమ్మర్‌లో పెద్ది వస్తే మళ్లీ క్లాష్ అవుతుందని భావించి ఆ సినిమాను 2026 సెకండ్ హాఫ్‌కి షిఫ్ట్ చేస్తున్నారట. పెద్ది సినిమాలో చరణ్‌కి జతగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News