Thursday, September 25, 2025

యాదగిరిగుట్టకు తీసుకెళ్లి బాలికలపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అల్వాల్ చెందిన ముగ్గురు బాలికలను విహార యాత్ర పేరుతో యాదగిరిగుట్టకు తీసుకెళ్లి వాళ్లపై ముగ్గురు అత్యాచారం చేశారు. ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. 20న పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఉన్నాయని తల్లిదండ్రులకు తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలు చెప్పి బయటకు వెళ్లారు. తార్నాకకు చెందిన గండికోట మధు(19) జిహెచ్‌ఎంసిలో ఒప్పంద కార్మికుడుగా పని చేస్తున్నాడు. ముగ్గురు బాలికలతో మధుకు పరిచయం ఉండడంతో మాయమాటలు చెప్పి హోటల్‌కు తీసుకెళ్లి తన స్నేహితుడు అరవింద్(22), ఈసం నీరజ్(21)లను పరిచయం చేసిన అందరూ కలిసి భోజనం చేశారు. విహారయాత్రకు యాదగిరిగుట్టకు వెళ్దామని వారిని తీసుకెళ్లారు. అక్కడి వెళ్లిన తరువాత మూడు వేర్వేరు రూమ్‌లు బుక్ చేసి వారిపై అత్యాచారం చేశారు. అనంతరం తార్నాకలో వారిని వదిలిపెట్టి వెళ్లిపోయారు. తమపై జరిగిన విషయం బాలికలు తల్లిదండ్రులకు చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి ముగ్గురితో పాటు రూమ్ అద్దెకు ఇచ్చిన సోమేశ్‌ను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: రైతు ద్రోహి కాంగ్రెస్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News