Thursday, May 2, 2024

మేడిగడ్డ డిజైన్‌లోనే లోపం

- Advertisement -
- Advertisement -

స్పష్టం చేస్తున్న ప్రాథమిక సమాచారం

కౌన్సిల్‌లోనే నీటి కేటాయింపులపై నిర్ణయం : మంత్రులు భట్టి, ఉత్తమ్

మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానది పై ఉన్న ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు ఈ ప్రభుత్వం అప్పగించలేదని మంత్రులు భట్టి, ఉత్తమ్ తెలియజేశారు. అ న్ని ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు. కేసీఆర్ సిఎం గా ప్రమాణస్వీకారం చేసిన తరువాతనే సీలేరు, 7 మం డలాలు తెలంగాణ ప్రాంతం నుంచి పో గొట్టుకున్నామన్నారు. కేసీఆర్‌కు మోడీకి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలియవు, మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రేమ తప్ప ఏమి వద్దు అని కేసిఆర్ అ న్నారని తెలిపారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిందని , దోచుకుతిన్నదన్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం డిజైన్‌లోనే లోపం ఉందని ప్రా థమికంగా సమాచారం వచ్చిందన్నారు. వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 38వేల కోట్లు వ్యయపు అంచనాలతో మొత్తం 16లక్షల ఎకరాలకు సాగునీరందించేలా వ్యాప్కో సంస్థ డిజైన్ చేసిందని తెలిపారు. ప్రభుత్వం రీడిజైన్ పేరుతో రూ. 94వేల కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని అం దించిన ఆయకట్టు 40వేల ఎకరాలు మా త్రమేనని వివరించారు. కౌన్సిల్ సమావేశంలో సిఎంల స్థాయిలో జరిగే భే టీలో నీటి కేటాయింపులపై చర్చలు జరుగుతాయని, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వద్ద జరిగిన చర్చల్లో కూడా కేంద్రం ఇదే విషయం తెలిపిందని డిప్యూ టీ సిఎం భట్టి పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News