Sunday, May 5, 2024

ఆరోగ్యకరమైన ఓటరు జాబితాను రూపొందించాలి..!

- Advertisement -
- Advertisement -
  • అర్హులంతా ఓటు హక్కును వినియోగించాలి
  • బిఎల్‌ఓల శిక్షణలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి

సంగారెడ్డి: ఆరోగ్యకరమైన ఓటరు జాబితాను రూపొందించాలని జిల్లా అదనపుకలెక్టర్ వీరారెడ్డి పేర్కొన్నారు.తద్వారా అర్హులైన వారంతా తమ ఓటు హక్కును వినియోగించే అవకాశం కల్పించాలన్నారు. ఈ విషయంలో మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని చెప్పారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి బిఎల్‌ఓ, సూపర్ వైజర్లకు సామర్థాల పెంపు,ఓటర్ జాబితా రూపకల్పన, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై మాస్టర్ శిక్షకులు శిక్షణ నిచ్చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వంద శాతం ప్యూరిఫైయర్ ఓటగరు జాబితాను తయారు చేయాలన్నారు.అర్హులంతా ఓటరు జాబితాలో ఉండాలని సూచించారు.

ఒక ఇంట్లో ఓటు హక్కు కల సభ్యులంతా ఒకే పోలింగ్ బూత్‌లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.ఒక పోలింగ్ కేంద్రంలో 1500 ఓటర్లు దాటినట్లయితే, రెండో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో బిఎల్‌ఓల పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ జాబితాను సవరించడం, తుది ఓటరు జాబితాను తయారు చేయడం, సమ్మరీ రివిజన్ తదితర విధులన్నీ సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. బిఎల్‌ఓలను ఈఆర్‌ఓ నియమిస్తారని చెప్పారు. బిఎల్‌ఓ తమ విధులను సమర్థవంతంగా నిర్వహించినప్పుడే ఆరోగ్యకరమైన ఓటరు జాబితా రూపొందుతుందన్నారు.ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లభిస్తుందన్నారు.

ఈ శిక్షణ సందర్భంగా తాము తెలుసుకున్న అంశాలను పునశ్చరణ చేసుకోవాలని, సక్రమంగా అమలు చేయాలని వీరారెడ్డి పేర్కొన్నారు. అన్ని పొలిటికల్ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలన్నారు.నియోజకవర్గ స్తాయి మాస్టర్ ట్రైనర్లు రేపటి నుంచి రెండు రోజుల పాటు అన్ని మండలాల్లోని బిఎల్‌ఓలు,బిఎల్‌ఓ సూపర్‌వైజర్లకు శిక్షణనిస్తారని చెప్పారు.అనంతరం జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లు నారాయణఖేడ్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణకుమార్,జహీరాబాద్ ఆర్డీఓ వెంకారెడ్డి నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణనిచ్చారు. డిఆర్‌ఓ నగేష్ ఆర్డీఓలు రవీందర్‌రెడ్డి, పాండు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News