Sunday, April 28, 2024

అయోధ్యలో ఆ రోజున భారీ ప్రమిద

- Advertisement -
- Advertisement -

త్రేతాయుగ ప్రతీకగా దశరథ దీప్
అయోధ్య : ఈ నెల అయోధ్యలో తలపెట్టిన రామాలయ ప్రతిష్ట దశలో ఓ కీలక ఘట్టం కూడా ఉంటుంది. అత్యంత భారీ స్థాయి దియా అంటే మట్టి దీపం లేదా ప్రమిదను ప్రతిష్టాపన దశలో వెలిగిస్తారు. రాముడి కాలం త్రేతాయుగం ప్రతికగా ఈ జ్యోతిని ప్రజ్వలింపచేస్తారు. ఈ విషయాలను స్థానిక ప్రముఖులు కొందరు వార్తాసంస్థలకు తెలిపారు. రామాయణ కాలంలో ఈ భారీ దీపాల వెలిగింపు ఆనవాయితీగా ఉండేది. ఇక్కడ ఇప్పుడు వెలిసే దాదాపు 28 మీటర్ల మేర వెడల్పుగా ఉండే ఈ దీపాన్ని దశరథ దీప్‌గా వ్యవహరిస్తారు. రాముడి తండ్రి దశరథుని పేరిట ఈ జ్యోతి వెలుస్తుంది. ఇక ఈ దీప ప్రజ్వలనకు దాదాపు కనీసం 21 క్వింటాళ్ల చమురు అవసరం అవుతుంది. ఇది ఎటువంటి చమురు? నెయ్యితో వెలిగిస్తారా? లేక ఇతరత్రా వేరే చమురును నింపుతారా? అనేది వెల్లడించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News