Thursday, August 7, 2025

జాతీయ హోదా దక్కడంతో ఆప్ సంబురాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎన్నికల కమిషన్ ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా ఇవ్వడంతో ఆ పార్టీ కార్యకర్తలు మంగళవారం సంబురాలు జరుపుకున్నారు. ఢిల్లీలోని ఆప్ పార్టీ కార్యాలయం ఆవరణ అంతా పువ్వులు, బెలూన్లతో అలంకరించారు. కార్యకర్తలు వాయిద్యాలకు తగినట్టు ఆనందంతో ఉర్రూతలూగుతూ నృత్యాలు చేశారు.డిడియు మార్గ్ లోని వీధులన్నీ పసుపు, నీలం బెలూన్లతో అలంకరించారు. మహిళా కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై స్వీట్లు పంచిపెట్టారు. పార్టీ పతాకాలను ప్రదర్శిస్తూ దేశభక్తి గీతాలు ఆలపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News