Thursday, October 10, 2024

హర్యానాలో ఒంటరిగా ఆప్ పోటీ

- Advertisement -
- Advertisement -

హర్యానా శాసనసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య సీట్ల పంపకంపై పొత్తు చర్చలకు అవరోధం ఏర్పడింది. అర్వింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ హర్యానాలో 50 సీట్లకు పోటీ చేయాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఆప్ తమ అభ్యర్థులతో తొలి జాబితాను ఆదివారం విడుదల చేయవచ్చునని ఆ వర్గాలు సూచించాయి. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి కొద్దిగా ముందు ఆప్ వర్గాలు ఈ సూచన చేశాయి. ‘హర్యానాలో పొత్తు చర్చలు విఫలం కాబోతున్నాయి. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ సీట్లలోకి 50 సీట్లలో ఆప్ పోటీ చేయాలని యోచిస్తున్నది

’ అని ఆ వర్గాలు తెలియజేశాయి. హర్యానాలో పది అసెంబ్లీ సీట్లను ఆప్ కోరుతున్నదని, కానీ కాంగ్రెస్ ఐదు నుంచి ఏడు సీట్లు ఇవ్వజూపుతున్నదని పార్టీ ఆంతరంగికులు తెలిపారు. సీట్ల పంపకంపై ఏకాభిప్రాయం వచ్చే సూచనలు కనిపించడం లేదని ఆ వర్గాలు తెలిపాయి. ఇండియా కూటమిలో భాగస్వామి పక్షాలైన ఆప్, కాంగ్రెస్ ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో హర్యానా, గుజరాత్, ఢిల్లీలలో కలసి పోటీ చేశాయి. హర్యానాలో కురుక్షేత్ర స్థానాన్ని ఆప్‌కు కేటాయించారు. కానీ ఆ స్థానంలో హర్యానా ఆప్ అధ్యక్షుడు సుశీల్ గుప్తా బిజెపి అభ్యర్థి నవీన్ జిందాల్ చేతిలో ఓడిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News