Monday, April 29, 2024

200 మంది ప్రజల అపహరణ

- Advertisement -
- Advertisement -

వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు
ఈశాన్య నైజీరియాలో తీవ్రవాదుల దుశ్చర్య

అబూజ (నైజీరియా) : ఈశాన్య నైజీరియాలో హింసాకాండతో నిర్వాసితులైన కనీసం 200 మంది వ్యక్తులు చాద్ సరిహద్దు సమీపంలో కలప కోసం అన్వేషిస్తుండగా ఇస్లామిక్ తీవ్రవాదులు వారిని అపహరించినట్లు నైజీరియాలోని ఐక్యరాజ్య సమితి (యుఎన్) కార్యాలయం వెల్లడించింది. కిడ్నాప్ అయినవారిలోఎక్కువ మంది మహిళలు, పిల్లలు. బోర్నో రాష్ట్రంలోని గంబోరు ఎన్‌గల కౌన్సిల్ ప్రాంతంలో కలప కోసం వెతకడానికి బాధితులు పలు నిర్వాసిత శిబిరాలు వీడినప్పుడు తీవ్రవాదులు వారిని చుట్టుముట్టి బందీలుగా చేసుకున్నారని యుఎన్ తెలియజేసింది.

‘కచ్చితంగా ఎంత మంది కిడ్నాప్ అయ్యారో ఇప్పటికీ తెలియదు. కానీ 200 మందికి పైగానే ఉంటారని అంచనా’ అని నైజీరియాకు యుఎన్ మానవతావాద విభాగం సమన్వయకర్త మొహమద్ ఫాల్ దాడులపై ఒక ప్రకటనలో తెలిపారు. ఆ దాడులు చాలా రోజుల క్రితమే జరిగాయి. కానీ ఆ ప్రాంతంలో సమాచారం సేకరణకు పరిమితంగా అవకాశాలు ఉన్నందున దాడుల వివరాలు ఇప్పుడు మాత్రమే వెలువడుతున్నాయి. ‘పరిరక్షక బృందాల సమాచారం ప్రకారం, వృద్ధ మహిళలు, పది సంవత్సరాల లోపు పిల్లలు కొంత మందిని విడుదల చేశారు. కాని చాలా వరకు ఐడిల లెక్క తేలడం లేదు’ అని ఫాల్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News