Saturday, December 14, 2024

అనుమతిస్తే కెటిఆర్‌పై చర్యలు: సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

గవర్నర్ అనుమతి నుంచి తప్పించుకోవడానికే కెటిఆర్ ఢిల్లీలో చక్కర్లు 
కలెక్టర్‌పై దాడి తీవ్రమైన అంశం 
దాడి చేసిన వారిని వదిలిపెట్టం 
హస్తినలో విలేకరులతో సిఎం రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై జరిగిన దాడి వెనుక ఎవరున్నా వదలమని, ఎంతటి వారైనా జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని సిఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్, రెవెన్యూ అధికారులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నా రు. కలెక్టర్‌పై దాడి చేసిన వా రిని ఎవరిని వదిలిపెట్టమని, అధికారులపై దాడులు చేసేలా ప్రోత్సహించే వా రిని కూడా విడిచిపెట్టమని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

అధికారులపై భౌతిక దాడులకు పాల్పడుతూ చంపాలని చూస్తోన్న వారిని బిఆర్‌ఎస్ పార్టీ ఎలా సమర్థిస్తుందని, అధికారులపై దాడిని బిఆర్‌ఎస్ ఎందుకు ఖండించలేదని సిఎం రేవంత్ ప్రశ్నించారు. అధికారులపై దాడి చేసిన వాళ్లను ఆ పార్టీ నేతలు ఎలా పరామర్శిస్తారని సిఎం రేవంత్ నిలదీశారు. అధికారులపై దాడులు చేస్తుంటే ప్రభుత్వం చూస్తు ఊరుకోదని ఆయన హెచ్చరించారు.  మొదట అధికారం కోల్పోయారు, ఆ తరువాత డిపాజిట్లు, ఆ తరువాత మెదడు కూడా బిఆర్‌ఎస్ కోల్పోయిందని సిఎం రేవంత్ ఎద్దేవా చేశారు. గవర్నర్ అనుమతి ఇవ్వగానే కెటిఆర్‌పై చర్యలు తీసుకుంటామని సిఎం రేవంత్ పేర్కొన్నారు.

గవర్నర్ అనుమతి నుంచి తప్పించుకోవడానికే ఢిల్లీలోని బిజెపి నేతల చుట్టూ కెటిఆర్ చక్కర్లు కొడుతున్నారని సిఎం రేవంత్ ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా తనపై వారు ఎదురుదాడి చేస్తున్నారని ఆయన విమర్శించారు. కెటిఆర్ పేర్కొన్న అమృత్ టెండర్‌లు వేసింది బిఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యే అల్లుడేనని ఆయన గుర్తు చేశారు. తనకు తెలంగాణ రెడ్డి సామాజిక వర్గంలో దగ్గరో, దూరమే బంధువులు అయినంత మాత్రాన అది తనకే అంటగడుతూ విషప్రచారం చేస్తున్నారని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కెటిఆర్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై అభ్యంతరం ఉంటే కోర్టుకు ఆయన వాదనలు వినిపించవచ్చని సిఎం రేవంత్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News