Tuesday, May 14, 2024

పెద్దఅంబర్‌పేట్ 5వ వార్డులో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

అబ్దుల్లాపూర్‌మెట్: పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు సర్వే నంబర్ 266 తో పా టు 264, 265 సర్వే నంబర్ 321, 322 లలో జోరుగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు, మహిళలు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 6 నెలల నుండి 5వ వార్డులో జరుగుతున్న అక్రమ నిర్మాణాల మీద చర్యలు తీసుకోవాలనీ ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం నోటీస్‌లు కూడా జారీ చెయ్యకుండా నిర్లక్ష్యం చెయ్యడంతో శనివారం శాంతియుత ధర్నా చేశామని చెప్పారు.

ధర్నా ముగిసిన తర్వాత చివరగా మరొక ఫిర్యాదు అందించి వారం పక్షంలో ఆ నిర్మాణాల మీద చర్యలు తీసుకోకపోతే మున్సిపల్ ఆఫీస్ ముందు టెంట్ వేసుకొని రిలే నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు ఎంజాల గిరి, బొర్రా శ్రీరాములు, సిలివెరీ అర్జున్, ఉసిగారి రాజు, సౌండ్ శ్రీ ను, యం జాల సంజీవ, ఎంజాల ప్రహల్లద్, ఎంజాల రాజు, ఎంజాల నర్సింహా, కొ రివి అంజయ్య, బొర్రా సాయిలు, బొ ర్రా నర్సింహా, ఉసిగారి లక్ష్మయ్య, ఉసిగారి నరేష్ కొరివి రాజు, కోర్వి నాగరాజు, యంజాల రాంబాబు, కోర్వి శ్రీరామ్, ఉసిగారి సురేష్, ఉసిగారి మధు, ఉసిగారి శివ, స్థానిక మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News