Thursday, May 2, 2024

10 బిలియన్ డాలర్ల విలువను కోల్పోయిన అదానీ స్టాక్‌లు

- Advertisement -
- Advertisement -

ఎంఎస్‌సిఐ నుంచి తొలగింపు

ముంబై: అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ ఈ నెలాఖరులో ఎంఎస్‌సిఐ ఇండియా గేజ్ నుంచి తొలగించబడే రెండు స్టాక్‌లు, ఇవి ఇక వచ్చే వారాల్లో నష్టాలను చవిచూడవచ్చు. అదానీ గ్రూప్‌లోని స్టాక్‌లు ఈ వారం మార్కెట్ విలువలో 10 బిలియన్ డాలర్ల విలువను కోల్పోయాయి. నిధుల సమీకరణ ప్రణాళికలో కూడా అదానీ గ్రూప్ పలుచనయింది.
జనవరి చివరలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల కారణంగా అదానీ స్టాక్‌లు బలహీనపడ్డాయి. అదానీ గ్రూప్ స్టాకులు మార్కెట్ విలువలో 150 బిలియన్ డాలర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం మార్కెట్ క్యాపిటల్ నష్టం 128 బిలియన్ డాలర్లుగా ఉంది. అదానీ, హిండెన్‌బర్గ్ ఆరోపణలను ఖండించారు. నివేదిక తర్వాత అప్పులు, కార్పొరేట్ పాలనపై మదుపరుల ఆందోళనలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారు.

Adani group value

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News